వంగవీటి మాటలతో ఆలోచనలో పడ్డ వైసిపి శ్రేణులు ?

Thursday, January 18th, 2018, 02:23:42 PM IST

విజయవాడ నేత, వంగవీటి మోహన రంగ కుమారులు అయిన వంగవీటి రాధా ఇటీవల టిడిపి లో చేరుతున్నారన్న వార్త పెను సంచలనమే రేపింది. ఆయన వెళ్లడం లేదని ఇదంతా టిడిపి నాయకుల అభూత కల్పనగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టి పారేసింది. ఈ విషయమై రాధా ను మీరు వైసిపి లో అసంప్త్రుప్తి గా ఉంటే మరి పార్టీ ని ఎందుకు వీడడం లేదని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తాను ప్రస్తుతం పార్టీలోనే వున్నానని, దేనికైనా సమయం రావాలని అన్నట్లు సమాచారం. ప్రస్తుతం తన పని తాను చేసుకుపోతున్నానని, ఒకవేళ పార్టీ మారవలసివస్తే పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తానని, తనని పార్టీ లో చేర్చుకోమని ఇప్పటివరకు ఏ పార్టీ వారితోను ఎటువంటి చర్చలు జరపలేదని అన్నట్లు చెపుతున్నారు. అయితే తనకు అధికార టిడిపి లో బంధువులు, ఆత్మీయులు వున్నారని, వారితో అప్పుడప్పుడు కలుస్తుంటానని చెప్పిన ఆయన ప్రతి సంబంధాన్ని రాజకీయంతో ముడిపెట్టడం సరైనది కాదని స్పష్టం చేశారని తెలుస్తోంది. యం ఎల్ ఏ గా పోటీ చేసిన తనకు యమ ఎల్ సి అవసరం లేదని, చిన్న పదవులు ఆశించి పార్టీ మారబోనని చెప్పారు. వైసిపి నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ఆయన ఒప్పుకున్నట్లు, అలా అని పూర్తిగా దూరంగా లేనని చెప్పారని తెలుస్తోంది. అయితే ఈ మధ్య నున్న లో జరిగిన ఒక పార్టీ కార్యక్రమం లో పాల్గొన్నానని చెప్పుకొచ్చారట. చివరిగా ఒక వేళ పార్టీ మారవలసివస్తే కంగారుపడకుండా, మంచి చెడులు ఆలోచించి, అందరికి చెప్పే మారతానని, తన రాజకీయ భవిష్యత్తు ఏంటో తనకు తెలుసని వెల్లడించినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికి రాధా మనసులోని ఈ మాటల వల్ల వైఎస్సాఆర్ పార్టీ శ్రేణుల్లో కొంత సందిగ్ధత నెలకొన్న మాటవాస్తవమే అని తెలియవస్తోంది….