వంగవీటి దారెటు.. టీడీపీలోకా, జనసేనలోకా..?

Tuesday, October 24th, 2017, 04:49:21 PM IST

వైసిపి అధినేత పై ఆ పార్టీ నేత వంగవీటి రాధా అలక వహించారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కుటుంబ నేపథ్యంతో రాజకీయంగా పాపులర్ అయినా వంగవీటి రాధ ప్రస్తుతం వైసిపిలో కొనసాగుతున్నారు. తనపై ఘాటు వ్యాఖ్యలు చేసిన గౌతమ్ రెడ్డి కి జగన్ అధిక ప్రాధాన్యత కల్పిస్తుండడంతో రాధా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు ఆయన అనుచర వర్గం నుంచి సమాచారం.

పార్టీ మారే వలస నేతలందరికీ మొదటి ఆప్షన్ అధికార పార్టీ మాత్రమే. ఈనేపథ్యంలో రాధా టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతుండగా, జనసేన పార్టీలో చేరే అవకాశాల్ని కొట్టి పారేయలేమని కొందరు అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో పవన్ కళ్యాణ్ తో రాధకు పరిచయం ఏర్పడింది. రాధా జనసేన పార్టీవైపు చూస్తున్నారనే వార్తలు ఇప్పుడు పుట్టుకొచ్చినవి కాదు. గతం లోనే ఆయన జనసేన పట్ల ఆకర్షితులయ్యారు. కానీ అప్పటికి ఉన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రాధా ఆ ఆలోచనని విరమించుకున్నారు. వైసిపిలో తన చూట్టూ వ్యతిరేక వాతావరణం నెలకొని ఉండడంతోరాధా కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments