వైసిపి ని వీడనున్న వంగవీటి రాధా ?

Wednesday, January 17th, 2018, 01:13:23 PM IST

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకి వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది , ఇప్పటివరకు 22 మంది ఎం ఎల్ ఏ లు ఆ పార్టీ నుండి బయటకు రావడం జరిగింది. పార్టీ అధినేత వై ఎస్ జగన్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పార్టీ నుండి వలసలు ఆపలేకపోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ మాజీ ఎంఎల్ ఏ వంగవీటి రాధాకృష్ణ పార్టీ ని వీడనున్నట్లు సమాచారం అందుతోంది. గత కొద్దీ కాలంగా ఆయన పార్టీ కార్యక్రమాల పై సుముఖంగా లేరని, ముఖ్యంగా విజయవాడ కు చెందిన మరొక వైసిపి నేత పూనూరు గౌతమ్ రెడ్డి తో ఆయనకు విబేధాలు వచ్చినపుడు పార్టీ సభ్యులు, అధిష్టానం తనకు ఏ విధంగానూ మద్దతు తెల్పకపోవడం వల్ల ఆయన తీవ్ర మనస్తాపానికి లోనయ్యారని తెలుస్తోంది. అందుకే ఆయన రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. ఆయన ఈ నెల 22న లేదా 23 న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షం లో టిడిపి లో చేరే అవకాశం ఉందని వార్తలు అందుతున్నాయి…