ఇన్నాళ్లు వైసీపీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా..వంగవీటి శ్రీనివాస ప్రసాద్..!

Tuesday, September 18th, 2018, 04:08:32 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి యొక్క పార్టీ అయిన వైసీపీ పార్టీలో కలకలం రేగింది. వారు తీసుకున్న అనుచిత నిర్ణయం పట్ల వారి అభిమానులు ఆ పార్టీ నుంచి రాజీనామాలు చేసి వెళ్లిపోతున్నారు.ఇటీవలే విజయవాడ సెంట్రల్ టిక్కెట్టు ఎప్పటి నుంచో వైసీపీ పార్టీకి అండగా ఉండి తన వంతు కృషి చేసిన వంగవీటి రాధ గారికి ఇవ్వకుండా వేరే వాళ్లకి ప్రకటించడంతో తీవ్ర దుమారం చెలరేగింది.ఈ విషయంపై కొంత మంది అభిమానులు ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యగా రాధ గారు వారిని మందలించారు.

ఈ రోజు ఈ విషయంపై వంగవీటి శ్రీనివాసు ప్రసాద్ గారు మాట్లాడుతూ వైసీపీ పార్టీలో వారు క్రమశిక్షణతో ఎల్లప్పుడూ పని చేస్తున్నాం అని,గత ఎనిమిది సంవత్సరాలుగా వైసీపీ పార్టీకి కొమ్ము కాసినందుకు ఆ పార్టీ అధ్యక్షడు వై స్ జగన్మోహన్ రెడ్డి మాకు తగిన గుణపాఠం తెలియజేసారని.వారు ఇన్నాళ్లు ఎదో పదవిని ఆశించో లేక డబ్బు సంపాదించడానికో లేక ఇప్పుడు వారి పార్టీ టిక్కెట్లు ఇస్తున్న అభ్యర్థులు పెట్టుకుంటున్న మద్యం దుకాణాలు పెట్టి కల్తీ మద్యం అమ్మి అమాయకుల ప్రాణాలు తీసే కుటుంబం కాదని,పేద ప్రజల పట్ల ఎలా నడుచుకోవాలో వారి తల్లిదండ్రులు వారి బావ మోహనరంగా నేర్పించారని అలంటి మాకు ఈ రోజు ఇప్పటి వరకు వైసీపీ పార్టీలో పని చేసినందుకు సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితిని ఈ రోజు జగన్ తీసుకువచ్చారని తెలిపారు. అందుకే వారు మరియు వారి అనుచరులు తీవ్ర ఆగ్రహానికి లోనయి వైసీపీ పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నాం అని తెలిపారు.