వామ్మో రోజు ఒక్క‌డే అంటే నావ‌ల్ల కాదు.. వరలక్ష్మి సంచ‌ల‌నం..!

Thursday, November 15th, 2018, 01:36:57 AM IST

కోలీవుడ్ బొద్దుగుమ్మ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ఇటీవ‌ల పందెంకోడి-2, స‌ర్కార్ లాంటి క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ రెండు చిత్రాల్లోనూ భిన్న‌మైన పాత్రల్లో న‌టించి విమ‌ర్శ‌కుల‌ను సైతం మెప్పించింది వ‌ర‌ల‌క్ష్మీ. పందెంకోడి-2 చిత్రంలో విల‌న్‌గా అద‌ర‌గొట్టిన వ‌ర‌ల‌క్ష్మీ, స‌ర్కార్ చిత్రంలోనూ టిపిక‌ల్, క‌న్నింగ్, పొలిటీషియ‌న్ పాత్ర‌లో త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. దీంతో నెగిటీవ్ క్యారెక్ట‌ర్ల‌లో ఒదిగిపోయిన వ‌ర‌ల‌క్ష్మీ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు.

అయితే ఇప్పుడు అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే స‌ర్కార్ చిత్రం త‌ర్వాత వ‌రుస ఇంట‌ర్వ్యూలు ఇస్తుంది వ‌ర‌ల‌క్ష్మీ. ఈ క్ర‌మంలో తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో భాగంగా పెళ్లి పై స్పందిస్తూ.. వ‌ర‌ల‌క్ష్మీ చేసిన వ్యాఖ్య‌లు సినీ వ‌ర్గాల్లో ర‌చ్చ లేపుతున్నాయి. త‌న‌కు పెళ్లి పై పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ లేద‌ని.. పెళ్లి చేసుకుని ప్ర‌తిరోజు ఒక‌డి ముఖాన్నే చూడ‌డం త‌న వ‌ల్ల కాద‌ని.. దీంతో పెళ్లి చేసుకునే ఉద్దేశం త‌న‌కు లేద‌ని వ‌ర‌ల‌క్ష్మీ చెప్పింది. అంతేకాకుండా ప్రేమ అయితే త‌న‌కు ఓకే కానీ పెళ్లి మాత్రం త‌న‌కు సెట్ అవ‌ద‌ని, ఒక యాంబిష‌న్‌తో ముందుకు వెళ్ళాల‌నుకునే వాళ్ళు పెళ్లి చేసుకుని ఏం చేస్తార‌ని ఎదురు ప్ర‌శ్నించింది వ‌రల‌క్ష్మీ. దీంతో ఈ అమ్మ‌డి వ్యాఖ్య‌లు కోలీవుడ్ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతున్నాయి.