ఏపీ బ్లాస్టింగ్ న్యూస్ : వైసీపీలో చేరిన టీడీపీ సీనియ‌ర్ నేత‌.. వ‌ర్ల రామ‌య్య సోద‌రుడు..!

Wednesday, January 30th, 2019, 02:52:27 PM IST

ఏపీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేల వైసీపీ జోరు ఏమాత్రం ఆగ‌డంలేదు. వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌తో ఆ పార్టీకి వ‌చ్చిన ఫుల్‌మైలేజ్‌కు ఎలాంటి బ్రేకుల్లేకుండా టాప్‌గేర్‌లో దూసుకుపోతుంది. ఈ క్ర‌మంలో ఒక‌వైపు అభ్య‌ర్ధుల ఎంపిక చేస్తూనే మ‌రో వైపు బ‌స్సు యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నారు జ‌గ‌న్. ఇక ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో స‌మ‌ర శంఖారావం కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఫిబ్ర‌వ‌రి నెల‌ఖ‌రుకు మొత్తం అభ్య‌ర్ధుల జాబితా సిద్ధం కానుంద‌ని తెలుస్తోంది.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ఒక‌వైపు ఎన్నిక‌ల నోటిఫికేష్ విడుద‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుంటే.. మ‌రోవైపు వైసీపీలో మాత్రం వ‌ల‌స‌లు ఆగ‌డం లేదు. ఇప్ప‌టికే ప‌లువురు సిట్టింగ్ అండ్ మాజీ నేతలు వైసీపీలో చేర‌గా.. ఇప్పుడు అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత సోద‌రుడు వైసీపీలో చేరారు. టీడీపీ సీనియ‌ర్ నేత వ‌ర్ల రామ‌య్య సొంత సొద‌రుడు వ‌ర్ల ర‌త్నం బాబు బుధ‌వారం వైసీపీలో చేర‌డంతో టీడీపీలో పెద్ద క‌ల‌క‌ల‌మే రేపింది. ఈ క్ర‌మంలో వ‌ర్ల ర‌త్నం విజ‌య‌వాడ‌లోకి వైసీపీ కార్యాల‌యంలో ఆ పార్టీ సీనియ‌ర్ నేత పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయ‌న‌తో పాటు బీసీ నేత కూరాడ నాగేశ్వ‌ర‌రావు కూడా వైసీపీలో చేర‌డం విజ‌య‌వాడ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో పెద్ద హాట్ అవుతోంది.