జగన్ బ్లాక్ మనీ ఎక్కడుందో ఆయనకు తెలుసంట..!

Saturday, November 12th, 2016, 03:45:10 AM IST

varla-ramaiah
500, 1000 కరెన్సీ నోట్ల రద్దుతో తో వైసిపి అధినేత ముఖం లో నైరాశ్యం కనిపిస్తోందని టిడిపి నేత వర్ల రామయ్య అన్నారు.పెద్ద నోట్లపై రద్దు వలన అవినీతి పరుల ఇళ్లలో మగ్గుతున్న నల్ల ధనం కొంతయినా బయటకు వస్తుందని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని కానీ జగన్ మాత్రం అస్వస్థత కు గురౌతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ తన నల్ల ధనాన్ని ఎలా తెల్లధనం గా మార్చుకోవాలో దీర్ఘంగా ఆలోచించడం అస్వస్థతకు గురయ్యారని రామయ్య అన్నారు.

తమకు అందిన సమాచారం ప్రకారం జగన్ తన నల్ల ధనాన్ని విలాసవంతమైన భవనాల నేల ,మాళిగలో దాచుకున్నట్లు తెలిసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో జగన్ అవినీతో సొమ్ము రూ 43 వేల కోట్లు ఉందని పేర్కొనిందని కానీ జగన్ వద్ద మరో రూ 43 వేల కోట్లు అవినీతి సొమ్ము ఉందని ఆయన అన్నారు.