పోలీస్ స్టేషన్ లో వర్మ ఫిర్యాదు!

Monday, May 21st, 2018, 08:04:33 PM IST


వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా, ఏమి మాట్లాడినా అది సంచలనమే. సమకాలీన జరుగుతున్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తుంటారు. అయితే గత కొద్దిరోజులుగా వర్మకు, రచయిత జయకుమార్ కు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న రచయిత జయకుమార్ నగ్నంగా వున్న ఒక లేడీ ఫొటోను మార్ఫింగ్ చేసి తన తల అతికించి పలువిధాలుగా దానిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడని వర్మ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. అయితే నిజానికి వర్మ తీసిన సంచలన చిత్రం గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ చిత్ర కథ తనదేనని జయ కుమార్ అప్పట్లో మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేసాడు.

అలానే రెండురోజుల క్రితం అక్కినేని నాగార్జున తో వర్మ తెరకెక్కిస్తున్న ఆఫీసర్ కథ కూడా తనదేనని హీరో నాగార్జున కు ట్వీట్ చేసాడు. జయకుమార్ సర్కార్ 3 కి కథ రచయితగా తన వద్ద పనిచేసే సమయంలో బానే ఉండేవాడని, అయితే ఆ తరువాత తన ఆఫీస్ లో పలు దొంగతనాలకు పాల్పడినట్లు రుజువయినందున అతన్ని మందలించి పనిలోనుండి తీసివేసినట్లు వర్మ గతంలోనే చెప్పారు. కాగా నేడు జేయ కుమార్ పై వర్మ చేసిన కంప్లైంట్ స్వీకరించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు…..

  •  
  •  
  •  
  •  

Comments