మెగా హీరో సినిమాకు ఆసక్తికర టైటిల్ ?

Wednesday, June 6th, 2018, 10:00:19 AM IST


సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం ప్రస్తుతం హైద్రాబాద్ లో వేసిన అంతరిక్షం సెట్స్ లో షూటింగ్ జరుగుంది. ఘాజి తరువాత సంకల్ప్ రెడ్డి చేస్తున్న సాటిలైట్ సినిమా ఇది. ఇందులో వరుణ్ తేజ్ వ్యోమగామిగా కనిపించనున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకోసం వరుణ్ తేజ్ ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక ఈ సినిమాకు ఏ టైటిల్ పెట్టాలన్న ఆలోచనలో పడ్డాడట దర్శకుడు .. ఇప్పటికే పలు రకాల టైటిల్స్ చూసాక ఈ చిత్రానికి అంతరిక్షం అనే టైటిల్ ఫిక్స్ చేశారట. తాజగా ఈ టైటిల్ ని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారట. వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, అతిథి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా దసరాకు విడుదల చేయాలనీ ప్లాన్ చేసారు. వరుస విజయాలతో జోరుమీదున్న మెగా హీరో వరుణ్ తేజ్ భిన్నమైన సీనిమాలు చేస్తున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments