హిట్టా లేక ఫట్టా : వీర భోగ వసంత రాయలు – అంతగా ఆకట్టుకోదు.

Friday, October 26th, 2018, 04:51:35 PM IST

హీరో నారా రోహిత్,సుధీర్ బాబు మరియు హీరోయిన్ శ్రియ శరన్ లు ప్రధాన పాత్రధారులుగా కొత్త దర్శకుడు ఇంద్రసేన దర్శకత్వంలో ఈ నెల 26 వ తేదీన విడుదలైన చిత్రం “వీర భోగ వసంత రాయలు”.సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం భిన్న అభిప్రాయాలను తెచ్చుకుంది.బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంతవరకు నిలబడగలిగింది,ఈ చిత్రం హిట్టా లేక ఫట్టా అనేది ఇప్పుడు చూద్దాం.

హీరో నారా రోహిత్ కొన్ని వైవిధ్యమైన కథలు ఎంచుకుంటాడు అని సినీ ప్రేక్షకుల్లో ఒక మంచి భావన ఉంది,అయితే రోహిత్ మరియు సుధీర్ బాబు,శ్రియా లకు ఎన్ని సినిమాలు చేస్తున్నా సరే పెద్దగా అవి ప్రేక్షకుల గుర్తింపును పొందలేకపోతున్నాయి.కానీ ట్రైలర్ తోనే ఆసక్తి నెలకొల్పి ఈ సారైనా హిట్ కొడతారని సినీ ప్రేక్షకులు అనుకున్నారు.ఈ చిత్ర కథలోకి వెళ్తే నారా రోహిత్,సుధీర్ బాబు మరియు శ్రియా లు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు,వీరు ముగ్గురు వేరువేరు ఆసక్తికరమైన కేసులను వీరు డీల్ చేస్తుంటారు,ఇలాంటి అంశాలు కొంచెం కొత్తగా ఈ దర్శకుడు తీసుకున్నాడు అనుకున్నా వాటిని అదే స్థాయిలో ప్రేక్షకులకు చూపించడంలో విఫలం అయ్యాడు అని చెప్పాలి.మొదటి సగ భాగాన్ని చూసుకున్నట్లైతే నారా రోహిత్ మరియు సుధీర్ బాబు,శ్రియాలు వారి వారి పాత్రలకు సరైన న్యాయం చేశారు.వారు వారికి వచ్చే ఛాలెంజింగ్ కేసులోను ఎదుర్కోవడం కొంచెం సస్పెన్స్ తో కూడిన సీన్లు ముఖ్యంగా చివరి 15 నిమిషాల ఎపిసోడ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

ఇక రెండో సగానికి వచ్చినట్టయితే ఈ చిత్రాన్ని ఇంద్రసేన ముందు ఎంత ఆసక్తికరంగా మొదలు పెట్టి అన్ని సినెమాలలాగే నెమ్మదింప చేసేసాడు,అసలు కొన్ని లాజిక్ లేని అనవసరమైన సీన్లు అవసరమా అని ప్రేక్షకులు అనుకునే విధంగా,తక్కువ బడ్జెట్ లో తియ్యడం వల్ల ప్రొడక్షన్ విలువలలో లోపం ప్రేక్షకులు ఇట్టే పసిగట్టేస్తారు,మంచి లైన్ ని దర్శకుడు ఎన్నుకున్నా సరే దాన్ని ప్రేక్షకుడికి చేరువయ్యేలా చెయ్యలేకపోవడంలో దర్శకుని యొక్క వైఫల్యం కూడా ఈ చిత్రానికి ప్రధాన మైనస్ పాయింట్ గా చెప్పొచ్చు.

మొత్తంగా చూసుకుంటే ఈ చిత్రం ట్రైలర్ చూసి నారా రోహిత్,సుధీర్ బాబు మరియు శ్రియాలు ఏదో చూపిస్తారు అనుకుంటే ఇదేంటి ఇలా ఉంది ఈ సినిమా అనుకునే విధంగా ప్రేక్షకులు అనుకునేలా చేశారు.సస్పెన్స్ థిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం మాత్రం ప్రేక్షకులని మాత్రం థ్రిల్ చెయ్యలేకపోయింది.బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ప్లాప్ గా నిలిచిపోతుంది.

ఆకట్టుకోని సస్పెన్స్ థ్రిల్లర్

Reviewed By 123telugu.com |Rating : 2/5
ఒక్క సారి మాత్రమే చూడొచ్చు

Reviewed By Thehansindia.com|Rating : 2/5
ఒక గమ్యం లేని ప్రయాణం

Reviewed By timesofindia.com|Rating : 2/5