డీఎల్ పై నిప్పులు చెరిగిన వీరశివారెడ్డి

Thursday, June 6th, 2013, 05:34:01 PM IST

ముఖ్యమంత్రి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రిత్వ శాఖ నుంచి ఇటీవలే బర్తరఫ్ అయిన మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి తన అభిమానులు, అనుచరులు చెప్పిన దాని ప్రకారం నేను ఎత్తి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వీడిపోను అంటుంటే కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి మాత్రం టిడిపితో పొత్తు కుదిరిందని, అలాగే డీఎల్ పై నిప్పులు చెరిగారు.

ఎమ్మెల్యే వీరశివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘ రాష్ట్ర మంత్రి వర్గంలో డీఎల్ రవీంద్రా రెడ్డి కలుపు మొక్కలాంటి వాడు. అందుకే ఆయన్ని బర్తరఫ్ చేసారు. డీఎల్ గంగమ్మకి వదిలేసిన దున్నపోతు లాంటి వాడు, అలాగే ఎ రోజు ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ప్రయత్నించాను. గతంలో ప్రతిపక్ష పార్టీలైన టిడిపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడానికి సహకరించాడు. ఉపఎన్నికల్లో డీఎల్ ఓడినా కిరణ్ దయ వల్లే మంత్రిగా కొనసాగాడు. ప్రస్తుతం డీఎల్ కి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో ఒప్పందం కుదిరిందని డీఎల్ వర్గం వారే చెబుతున్నారని’ ఆయన అన్నాడు. ఒకరేమో పార్టీ వదలనని, మరొకరేమో పార్టీని వదిలేస్తున్నాడని అధికార ప్రభుత్వంలోని నాయకులే కొట్టుకోవడం చూస్తుంటే నాయకుల్లో ఎంత ఔన్నత్యం ఉందో ఇట్టే తెలిసిపోతోంది.