కోహ్లీ వల్లే నా పదవి ఊడింది.. వెంగ్‌సర్కార్‌ షాకింగ్ కామెంట్స్!

Friday, March 9th, 2018, 02:30:59 AM IST

భారత క్రికెట్ టీమ్ లో అవకాశాన్ని దక్కించుకోవాలంటే అంత సాధారణమైన విషయం కాదు. ఒకప్పుడైతే రాజకీయాలు బాగానే సాగేవి అని వార్తలు ఓ రేంజ్ లో వచ్చేవి. అయితే కాలం కొన్ని ఘటనలను కప్పి వేస్తుంది. ఎవరు ఊహించని సమయంలో ఒక్కసారిగా బయటపడి ఆ విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రీసెంట్ గా బీసీసీఐ మాజీ సెలక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ చెప్పిన విషయం కూడా ఒక్కసారిగా అందరిని షాక్ కి గురి చేసింది. ఎందుకంటే కోహ్లీ కారణంగా ఆయన పదవి పోయిందని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

రీసెంట్ గా దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ ముంబై లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోహ్లీ కారణంగా తన పదవి ఏ విధంగా చేజారిందో అనే విషయాన్ని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 2008 లో ఇండియా జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లడానికి అండర్ -23 ఆటగాళ్లను తీసుకోవాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. అయితే అప్పుడే కోహ్లీ కెప్టెన్ గా అండర్- 19 వరల్డ్ కప్ ని అందించాడు. అలాగే ఇండియా ఏ తరపున ఆడి 123 పరుగులు చేశాడు. దీంతో కోహ్లీని లంక పర్యటనలో స్థానం కల్పించాలని అనుకున్నా. సెలెక్షన్ కమిటీలో ఉన్నవారంతా ఒకే చేశారు. కానీ అప్పటి కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌ – కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే కోహ్లీ స్థానానికి పోటీగా బద్రీనాథ్ ఉన్నాడు. అప్పటి వరకు కోహ్లీ కొంచెం బెటర్ గా అనిపించాడు. ధోని ఒప్పుకోలేదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్న బద్రీనాథ్ కి అవకాశం దక్కాలని కోహ్లీని వద్దన్నాడు.

అప్పటి బీసీసీఐ కోశాధికారి శ్రీనివాసన్‌ కు కూడా నా నిర్ణయం నచ్చలేదు. కోహ్లీ మంచి ఆటను కనబరుస్తున్నాడు అని వివరించాను. ఆయన కూడా బద్రీనాథ్ వైపే మొగ్గు చూపారు. తమిళనాడు తరపున బద్రీనాథ్ 800కు పైగా పరుగులను చేశాడు. అతను కూడా మంచి ఆటగాడే అని ఆయన అన్నారు. కానీ నేను అతనికి అవకాకాశం తరువాత ఇస్తానని చెప్పా కానీ ఎప్పుడు ఇస్తానో అనే విషయం చెప్పలేకపోయా. దీంతో తరువాత రోజు అంతా మారిపోయింది. నా పదవికి కాల పరిమితి అయిపోయిందని శ్రీకాంత్‌ను తీసుకొచ్చి నా స్థానంలో సెలక్టర్‌గా నియమింఛారని దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments