ఆంధ్ర కోసం అద్వానీనే ఎదిరించా..వెంకయ్య సంచలన వ్యాఖ్యలు..!

Tuesday, September 27th, 2016, 03:18:57 PM IST

venkayyanaidu
కాంగ్రెస్ విభజన నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని వెంకయ్య నాయుడు అన్నారు.అప్పుడు ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరగడం కోసం ఎంతవరకైనా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరిగేలా విభజన బిల్లు ఉంటేనే మద్దత్తు ఇస్తానని, లేకుంటే ఇవ్వనని అప్పడు ఎల్ కే అద్వానీకి తెగేసి చేపినట్లు వెంకయ్య అన్నారు.

ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరగక పొతే ఎంతకైనా తెగిస్తానని బిజెపి అధిష్టానానికి తాను చెప్పినట్లు వెంకటయ్య అన్నారు.తెనాలిలో ఆయనను సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన గుంటూరు లోని వరద ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు.

  •  
  •  
  •  
  •  

Comments