పవన్ చెప్పింది నిజమే..లడ్డూలు పాచిపోతాయి అంటున్న వెంకయ్య ..!

Tuesday, September 27th, 2016, 05:25:46 PM IST

venkayyanaidu
రాష్ట్ర విభజన సమయం లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కరూ మాట్లాడలేదు అనీ కానీ ఏపీ మంచి కోరుకుని ఏదైనా చెయ్యడానికి ప్రయత్నాలు చేసింది తానే అని వెంకయ్య నాయుడు గుర్తు చేసారు. ఇవాళ తెనాలి లో , గుంటూరు లో మాట్లాడిన ఆయన ఆదాయం లేని ఆంధ్ర ప్రదేశ్ ని ఒదిలివేయద్దు అని అప్పట్లో మొత్తుకున్నాను అన్నారు. ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసింది నేనే అని కూడా ఆయన ఒప్పుకున్నారు. కానీ తాను అడిగిన అంశాలని కాంగ్రెస్ పార్టీ బిల్లులో పెట్టలేదు అని సర్ది చెప్పుకొచ్చారు. పాచిపోయిన లడ్డూలు అంటూ పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్యాకేజీ గురించి చేసిన వ్యాఖ్యల విషయంలో కూడా వెంకయ్య సీరియస్ అయ్యారు. ‘ల‌డ్డూలు పాచి పోవ‌చ్చు.. కానీ, డ‌బ్బులు పాచి పోవు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన డబ్బుని కొంద‌రు పాచిపోయిన డ‌బ్బు అంటున్నారు. ఏవేవో మాట్లాడుతున్నారు. హోదా అనే అంశాన్ని పట్టుకుని వేళాడితే ఎట్లా ‘ అన్నారు ఆయన. ” హోదా కంటే గొప్పగా ఏపీ ని చూసుకుంటోంది బీజేపీ పార్టీ అది అర్ధం చేసుకోవాలి అందరూ. కేంద్రం ప్రభుత్వం ద్వారా విదేశీ రుణాలు ఇప్పిస్తున్నాం, కోటాను కోట్లు వడ్డీ మేమే కడతాం అన్నం . అయినా హోదానే కావాలి అంటేఅది సరైన పద్దతే కాదు ” అన్నారు వెంకయ్య. పోలవరానికి అయ్యే నిధులలో అరవై శాతం రాష్ట్రం నలభై శాతం కేంద్రం పెట్టుకోవాలి గానీ హోదా వస్తే కేంద్రం తొంభై శాతం భరించాలి కానీ ఇప్పుడు ప్రత్యేక సహాయం ద్వారా 100 శాతం నిధులు కేంద్రమే ఖర్చు పెడుతోంది. కదా ఆ పాయింట్ ఎందుకు మిస్ అవుతున్నారు అని వెంకయ్య ప్రశ్నించారు.

  •  
  •  
  •  
  •  

Comments