వెంకయ్య ఈ తరహా తలనొప్పి ఎప్పుడూ అనుభవించలేదేమో..?

Tuesday, January 31st, 2017, 12:12:03 AM IST

venkaiyanaidu
ఏపీ రాజకీయాలు ప్రస్తుతం ప్రత్యేక హోదా అన్న అంశం చుట్టూ తిరుగుతున్నాయి.కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని తలనొప్పిని ఎదుర్కొంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.కేంద్రం పై నిందవేసే వారంతా మొదట వెంకయ్య ని తిట్టడంతోనే ప్రారంభిస్తున్నారు. అధికారం లో ఉండి కూడా వెంకయ్య ప్రశాంతంగా లేరని అంటున్నారు. వెంకయ్య తలనొప్పి వ్యవహారానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ బిజెపికి పెద్ద గుది బండలా తయారవడమే. పవన్ కళ్యాణ్ ఈమధ్య ప్రత్యేక హోదా అంశంలో బీజీపీని విమర్శించడం వెంకయ్య నాయుడుతోనే ప్రారంభిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ వెంకయ్య నాయుడు పై విమర్శలు తీవ్రతరం చేస్తుండడంతో చివరకు ఆయనే వివరణ ఇచ్చుకోవసిన పరిస్థితి ఏర్పడుతోంది.ఇటీవల ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ వెంకయ్య నాయుడు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. వెంకయ్య స్వర్ణ భారతి ట్రస్ట్ పై పెట్టిన శ్రద్ద ఏపీ సమస్యలపై పెట్టి ఉంటే ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని పవన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా పవన్ వ్యాఖ్యలన్నింటికీ వెంకయ్య సమాధానాలు ఇస్తున్నారు.ట్విట్టర్ లోనే కాదు పని కూడా చేయాలని వెంకయ్య పవన్ ని ఉద్దేశించి అన్నారు. అంచలంచెలుగా ఎదగాలని పవన్ కు సూచించారు. తాము 40 ఏళ్ళు కష్టపడితేనే ఈ స్థాయికి వచ్చామని అన్నారు.