అయ్యా.. హోదా వేస్ట్.. ప్యాకేజీ బెస్ట్ !

Sunday, September 18th, 2016, 10:31:30 AM IST

venkayyanaidu
రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోయిన దగ్గర్నుంచి సీమాంధ్ర తరపున కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పూర్తి వకాల్తా పుచ్చుకుని కేంద్రంతో మంతనాలు సాగిస్తూ వచ్చారు. రాజ్యసభలో విభజన బిల్లు జరిగేటప్పుడు చెయ్యెత్తి పది వేళ్ళు చూపిస్తూ పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని ఆయన ఆడినప్పుడు ఏపీ ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టేసుకున్నారు. కానీ అంతా సర్దుకున్నాక ఇప్పుడు ఏపీకి హోదా అక్కర్లేదు ప్యాకేజీ బెస్ట్ అంటున్నారు వెంకయ్య.

నిన్న విజయవాడలో జరిగిన ప్యాకేజీ అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడుతూ ‘విడిపోయే పరిస్థితిలో ఏపీకి న్యాయం చేసేందుకే హోదా మాట ఎత్తాను. కాదు ఇప్పుడు చొస్తే దానికన్నా ప్యాకేజీయే బెస్ట్. హోదాతో 4,000 కోట్లు మాత్రమే వస్తాయి. అదే ప్యాకేజీతో అయితే2.25 లక్షల కోట్లు వస్తాయి. కాబట్టి ఇదే బెస్ట్. పేట్టుబడులు పెట్టేవారు కూడా హోదా చూసి రావడం లేదు. రాష్ట్రములో ఉన్న అవకాశాల్ని, జరగబోయే అభివృద్ధిని చూసి వస్తున్నారు’ అని ప్యాకేజీపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.