శృంగారంలో వాళ్లు వేస్ట్..వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు..!

Thursday, September 29th, 2016, 08:37:06 AM IST

venkainaidu
ప్రస్తుత సినిమా రంగం పై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.అప్పట్లో హీరో హీరోయిన్లు ఒకరి నొకరు తగలకుండానే ప్రేమ భావాల్ని పలికించేవారని అన్నారు.కానీ ఇప్పటి హీరో హీరోయిన్లు ఒకరినొకరు తాకినా, గోకినా.. ఏంచేసినా శృంగార రసాన్ని పండించలేకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రామోజి ఫిల్మ్ సిటీ లో జరిగిన ఇండి వుడ్ కార్నివాల్ లో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు.ప్రస్తుతం సినీ రంగం లో ప్రచారం ఆర్భాటం తప్ప ఏమి లేదని అన్నారు.సంగీతం స్థానంలో వాయిద్యం వచ్చి చేరిందని విమర్శించారు.భారతీయ సినీ పరిశ్రమకు ప్రపంచ స్థాయి కి ఎదిగే సత్తా ఉందని అన్నారు. విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగించారు. మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టి వినోదం అందించాలని కోరారు.సినిమాలు వినోదాన్ని మాత్రమే కాక సందేశాన్ని కూడా ఇవ్వాలని అన్నారు. అప్పట్లో సినిమాలు ఏడాది పాటు నడిచేవని అన్నారు. కానీ ప్రస్తుతం వారం ఆడితే గొప్ప అని అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments