సిడ్నీలో ‘వెంకీ’ హంగామా!

Thursday, March 26th, 2015, 08:25:41 AM IST


టాలీవుడ్ ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ నేడు జరగబోతున్న ప్రపంచ కప్ ఇండియా – ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించేందుకు సిడ్నీ చేరుకున్నారు. కాగా సహజంగా క్రికెట్ కు వీరాభిమాని అయిన వెంకటేష్ భారత్ ఆడే ప్రతీ కీలకమైన మ్యాచ్ లను ప్రత్యక్షంగా వీక్షించడం రివాజు. ఈ నేపధ్యంగానే నేడు జరగనున్న అత్యంత కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ ను వీక్షించేందుకు జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ చాముండేశ్వరినాధ్ తో కలిసి వెంకీ సిడ్నీకి చేరుకున్నారు.

ఇక భారత్ ఆడే కీలక మ్యాచ్ లు ప్రపంచంలో ఏ మూల జరిగుతున్నా అక్కడికి చేరుకొని వెంకటేష్ ఒక సగటు క్రికెట్ అభిమానిలా వీక్షిస్తారు. అలాగే వీక్షకుల స్టాండ్ నుండి కేరింతలు, చప్పట్లు కొడుతూ వెంకటేష్ క్రికెట్ ను ఆస్వాదించే తీరు మనకు తెలిసిందే. ఇక ఈ నేపధ్యంగానే నేడు కంగారులతో తలపడుతున్న భారత జట్టుకు మద్దతుగా వెంకటేష్ సిడ్నీ చేరుకొని మ్యాచ్ ను ఆస్వాదించనున్నారు.