అబ్బో .. మామా అల్లుడిని లైన్ లో పెట్టిన దర్శకుడు ?

Tuesday, October 17th, 2017, 01:14:33 PM IST

టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలకు మళ్ళీ కొత్త ఊపునిచ్చింది హీరో వెంకటేష్. సీతమ్మ వాకిట్లో.. సినిమాతో మహేష్ తో నటించి ఈ తరహా సినిమాలకు కొత్త ఊపునిచ్చాడు. ఆ తరువాత పలు మల్టీస్టారర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మల్టి స్టారర్ కు సిద్దమయ్యాడు వెంకీ .. అయితే ఈ సారి అయన మల్టీస్టారర్ సినిమా చేస్తున్నది ఎవరితో తెలుసా… మేనల్లుడు నాగ చైతన్యతో !! అవును వీరిద్దరితో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు కళ్యాణ్ కృష్ణ కురసాల. నాగార్జున తో సోగ్గాడే చిన్నినాయన చిత్రాన్ని రూపొందించిన కళ్యాణ్ కృష్ణ చైతన్య తో తీసిన రారండోయ్ వేడుక చూద్దాం .. మంచి క్రేజ్ తెచ్చుకున్న నేపథ్యంలో నెక్స్ట్ సినిమా కూడా మళ్ళీ చైతు తో ప్లాన్ చేసాడు. అయితే ఇందులో మరో హీరోకూడా ఉంటాడని ఆ పాత్రకోసం వెంకటేష్ ని సంప్రదిస్తున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న కళ్యాణ్ కృష్ణ, త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చే ప్లాన్ చేస్తున్నాడు. మరో వైపు తేజ దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పిన వెంకటేష్ ఏ సినిమా ముందు మొదలు పెడతాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments