పవన్ నటన అదుర్స్ అంట..!

Monday, January 12th, 2015, 06:48:27 PM IST


నెల్లూరులో వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సంక్రాంతి సంబారాలలో సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగ, ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడారు. తాను చిన్నతనంలో సినిమాలు చూసేవాడినని… తరువాత రాజకీయరంగంలోకి వచ్చాక సినిమాలు చూసేందుకు తగిన సమయం దొరకలేదని అన్నారు. గుండమ్మకథ సినిమా తనకు ఇష్టమైన సినిమా అని అన్నారు. కాగా, చాలా కాలం తరువాత తాను పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా చూశానని ఆయన చెప్పారు. అందులో పవన్ కళ్యాణ్ అద్బుతంగా నటించారని వెంకయ్య నాయుడు ప్రశంసించారు.