మీ గోల ఎవరు వినడం లేదు, చూడడం లేదు : వెంకయ్య ఆగ్రహం

Monday, July 23rd, 2018, 05:05:37 PM IST

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అందరి నోటా ఎక్కువగా వినిపిస్తున్న చర్చ ఒక్కటే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా, లేదా అని. అయితే ఇప్పటికే ప్రత్యేక హోదా, విభజన హామీల విషయమై బీజేపీ ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి చేసిన అన్యాయంపై టీడీపీ ఆ పార్టీపై లోక్ సభలో మొన్న అవిశ్వాస తీర్మానం ప్రవేశపుట్టింది. అయితే సరైన మద్దతు లభించకపోవడంతో వీగిపోయింది. ఇకపోతే నేడు రాజ్య సభలో టిడిపి మరియు వైసిపి ఎంపీలు ఏపీకి న్యాయం చేయాలనీ, తమ సమస్యలపై చేర్చించాలని పట్టుబట్టారు. ఉదయం సభ మొదలైన తరువాత రాష్ట్ర విభజన సమస్యలపై కొంత చేర్చకు వైసిపి, టిడిపి ఎంపీలు రాజ్యసభలో నోటీసు ఇవ్వడం జరిగింది. అయితే ఈ అంశం విషయమై తనకు నోటీసులు అందాయని, అయితే చర్చ మాత్రం నేడు కుదరదని, రేపు చేపడతామని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. అది కుదరదు నేడే తమ సమస్యలపై చర్చించాలని ఇరుపార్టీల ఎంపీలు పట్టుపడ్డం, హాల్ లో నినాదాలు చేయడం వంటివి చేశారు.

అంతటితో ఆగకుండా స్పీకర్ వెల్ లోకి దూసుకువచ్చి గట్టిగ నినాదాలు చేస్తూ, తమ సమస్యలను పరిష్కరించండి అంటూ సభకు అడ్డుతగలడంతో వెంకయ్య వారిని చాలా సేపు మెల్లగా వారించారు. దయచేసి మీ సీట్లలోకి వెళ్లి కూర్చోండి, మీ సమస్యలపై రేపు తప్పక చర్చ జరుపుతాం అని చెప్పినా వారు వినలేదు. ఎంతసేపటికి వారు వినిపించుకోకపోవడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఓవైపు మీరు ఎంత గోల చేస్తున్నప్పటికీ మీ గోలను ఎవరు వినడంలేదు సరికదా కనీసం ఎవరూ పట్టించుకోవడంలేదు కూడా అంటూ మండిపడ్డారు. అంతటితో ఆగకుండా వెంటనే టివి ప్రసారాలు కూడా నిలిపివేయండని ఆదేశించడంతో, సభ ప్రసారాలకు కాసేపు ఆటంకం కలిగింది. ఇక చేసేది లేక సభను విభజ అంశాలపై చేర్చించేందుకు రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు….

  •  
  •  
  •  
  •  

Comments