వేణుమాధవ్ నామినేషన్ తిరస్కరణ…

Saturday, November 17th, 2018, 08:15:45 AM IST

తెలుగు చలన చిత్ర హాస్యనటుడు వేణుమాధవ్‌ తెలంగాణ లో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం మనకి తెలిసిందే. సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అందుకుగాను గురువారం ఉదయం ఎన్నికల నామినేషన్ దాఖలు చేసేందుకు కోదాడ లోని ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేసాడు. అయితే తన నామినేషన్ పత్రాలను అధికారులు తిరస్కరించారు. దాంతో వేణుమాధవ్ నిరాశగా ఇంటి బాట పట్టారు.

వేణుమాధవ్ నామినేషన్ పత్రాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి, పత్రాలు సరిగా లేవని, తన నామనేషన్ చెల్లదని వేణుమాధవ్ కి చెప్పారు. దీంతో గురువారం నిరాశగా వేనుదిరుగుతుండగా అక్కడ పలకరించిన మీడియాతో వేణుమాధవ్ మాట్లాడారు. నా నామినేషన్ పత్రాలు సరిగా లేవని, అవి చెల్లవని చెప్పారు. పూర్తిస్థాయిలో నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకుని శని లేక ఆదివారాల్లో నామినేషన్‌ దాఖలు చేస్తానని వేణుమాధవ్ మీడియా కి తెలిపారు. కాగా వేణుమాధవ్ స్వస్థలం కోదాడ కావడంతో అక్కడినుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతున్నట్లు వివరించారు.