ఓరినాయనో.. ఈ జపాన్ తాత ప్రపంచంలోనే అత్యంత వృద్దుడా.. వయస్సెంత..?

Wednesday, April 11th, 2018, 11:46:02 AM IST

ప్రపంచంలో అత్యంత ఎక్కువ వయస్సు కలిగిన వృద్ధునిగా జపాన్‌కు చెందిన మసాజో నొనాక ఎంపికయ్యారు. ఆయన వయస్సు 112 ఏండ్లు. ఈ మేరకు మంగళవారం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు జపాన్ హొక్కయిడో ద్వీపంలోని ఆయన నివాసం వద్ద ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి కొద్దిరోజుల ముందు 1905 జూలై 25న నొనాక జన్మించారు. స్వీట్లు, వేడినీటి స్నానాల వల్లే ఆయన ఎక్కువ కాలం జీవిస్తున్నారని.. అదే ఆయన జీవిత విజయ రహస్యమని కుటుంబ సభ్యులు వెల్లడించారు. మసాజో నొనాక కుటుంబ సభ్యులు ఓ హాట్ స్ప్రింగ్ హోటల్‌ను నిర్వహిస్తున్నారు.

వారితో కలిసి నొనాక ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఆయన వీల్‌చైర్‌లో కూర్చుని అటూ ఇటూ తిరుగుతారని.. అయినా ఆయన ఆరోగ్యం బాగుందని ఆయన మనుమరాలు చెప్పారు. జపాన్ సంప్రదాయ మిఠాయిలతోపాటు పాశ్చాత్య పద్ధతిలో తయారు చేసిన అన్నిరకాల స్వీట్లను చాలా ఇష్టంగా తింటారని తెలిపారు. ఆయన ప్రతిరోజూ తప్పకుండా పత్రికలు చదువుతారని.. తరుచూ వేడినీటిలో సేదతీరుతారని పేర్కొన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments