విహెచ్‌కి బ‌డితె పూజే.. ప‌వ‌న్‌కి డ్ర‌గ్స్‌తో ఏంటి సంబంధం?

Saturday, January 13th, 2018, 10:18:53 AM IST

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత‌రావు సెన్సేష‌న్స్ కోసం పాకులాడుతున్నారా? ఇటీవ‌లి కాలంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా ప్రాముఖ్య‌త పెంచుకోవాల‌నుకునే నేత‌లే ఎక్కువ‌య్యారు. సినీసెల‌బ్రిటీల త‌ర‌హాలోనే అదే పంథాలో వెళుతున్నారంతా. మొత్తానికి ప‌వర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని డ్ర‌గ్ దందాలోకి లాగేందుకు స‌ద‌రు సీనియ‌ర్ కాంగ్రెస్ నేత ప్ర‌య‌త్నించ‌డం ప‌వ‌న్ అభిమానుల్లో చ‌ర్చ‌కొచ్చింది. డ్ర‌గ్ మాఫియా డీన్ కెల్విన్‌తో ప‌వ‌న్‌కి సంబంధాలున్నాయ‌ని, వాటిని ఆధారాల‌తో నిరూపిస్తాన‌ని విహెచ్ అంటున్నారు.

పవన్ కళ్యాణ్ కి కెల్విన్ కు సంబంధాలు ఏంటి? అంటూ అవాక్క‌యిపోతున్నారంతా. అయితే డ్రగ్స్ కేసులోకి పవన్ ని లాగే ప్రయత్నంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఎందుకు చేస్తున్నారు అన్న‌ది అంతుప‌ట్ట‌డం లేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యహారాల పై విహెచ్‌ పోరాటం చేస్తున్నారు స‌రే.. ప‌వ‌న్‌ని ఇలా డ్ర‌గ్ దందాలోకి లాగాల్సిన అవ‌స‌ర‌మేంటి? ఆ ప‌ని చేయాల్సింది పోలీసువాళ్లు క‌దా? ఒక‌వేళ నిజంగానే ప‌వ‌న్‌కి సంబంధాలు ఉంటే అంత తేలిగ్గా వ‌దిలేస్తారా? ర‌వితేజ, పూరి అంత‌టివాళ్ల‌నే వ‌దిలిపెట్ట‌లేదు. ప‌వ‌న్‌ని వ‌దిలేస్తారా? అంటూ పీకే ఫ్యాన్స్‌లో ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. టీవీ 9 ఎన్‌కౌంట‌ర్ విత్ ముర‌ళి కార్య‌క్ర‌మంలో విహెచ్ చేసిన‌ సంచలన వ్యాఖ్యలు ప‌లు వివాదాల‌కు తావిచ్చే ఆస్కారం ఉందని అంచ‌నా వేస్తున్నారు. ఆదివారం రాత్రి 9.30కి తిరిగి సోమవారం ఉదయం 9.30 కు టీవీ9లో ఈ హాట్ హాట్ ముఖాముఖి జ‌రుగుతోంద‌న్న సంగ‌తి తెలిసిందే. వీహెచ్ ఎపిసోడ్ హీట్ పెంచ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.