‘గోపాల గోపాల’పై కూడా వీహెచ్‌పీ ఫైర్

Wednesday, December 31st, 2014, 02:20:08 PM IST

gopala-gopala

పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటిస్తున్న ‘గోపాల గోపాల’ సినిమాపై కూడా విశ్వ హిందూ ప‌రిష‌త్(వీహెచ్‌పీ) మండిపడుతోంది. ‘గోపాల గోపాల’ సినిమా రిలీజ్ ను ఆపేయాలని వీహెచ్‌పీ, భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశాయి. గోపాల గోపాల‌లో హిందూమ‌తాన్ని కించ‌ప‌రిచే అంశాలున్నాయ‌ని వీహెచ్ పీ భావిస్తోంది. ‘గోపాల గోపాల’ సినిమా ఓ వర్గం వారిని కించపరిచేలా ఉందంటూ ఈ ఫిర్యాదులో తెలిపాయి. అయితే ఫిర్యాదు చేస్తున్న సమయంలో సెన్సార్ బోర్డు సభ్యులు, ఉత్సవ కమిటీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టు సమాచారం.