అస్వస్థతకు గురైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Saturday, October 21st, 2017, 09:25:55 AM IST

బీజేపీ సీనియర్ నాయకుడు ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిన్న అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఉదయం బీపీ, షుగర్ లెవెల్స్ పెరగడంతో సిబ్బంది ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించాగా గుండె నొప్పి సమస్య ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా రక్తనాళాల్లోని సమస్యను పరిష్కరించడంలో భాగంగా డాక్టర్లు ఆయనకు స్టెంట్ వేశారు.

ప్రముఖ డాక్టర్ భార్గవ ఆధ్వర్యంలో వెంకయ్య నాయుడు గారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం డాక్టర్ భార్గవ మీడియాతో మాట్లాడారు. ఉప రాష్ట్రపతికి యాంజియోగ్రఫీ పరీక్ష చేశామని అలాగే ఆయన రక్తనాళాల్లో ఒకటి సన్నబడిందని గుర్తించి స్టెంట్ వేశామని తెలిపారు.
అలాగే ఆయన త్వరగానే కొలుకుంటారని కూడా వైద్యులు తెలిపారు. ఇక రాష్ట్రపతి ఆరోగ్యం గురించి పలువురు ప్రముఖులు వైద్యులతో మాట్లాడారు. అలాగే ప్రధానమంత్రి మోడీ కూడా పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. నేడు ఆయనను డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments