విలేజ్ నుండే విక్టరీ : ఇదేనా కేసీఆర్ అసలు వ్యూహం!?

Tuesday, July 24th, 2018, 03:05:38 PM IST

నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో తొట్టతొలిగా అధికారాన్ని చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి, మొదటి నుండి ప్రజల్లోకి వెళ్లి విరివిగా పథకాల అమలుతో వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా రూపుదిద్దెందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఆయన పదునైన వ్యూహాలతో ప్రత్యర్థులకు ధీటుగా సమాధానం చెప్పాలని చూస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయితీకి ఒక కార్యదర్శిని నియమించాలని నిర్ణయించారు. వీరి నియామకం మరొక వారంలో మొదలయి, మొత్తంగా రెండు నెలల్లో రాష్ట్రం మొత్తం అందరి నియామకం పూర్తి అయ్యేలా చూస్తున్నారు.

ఇక వీరికి మొదట రూ.15,000లను ప్రోబేషన్ లో భాగంగా జీతంగా చెల్లించడం జరుగుతుందని, ఇలా మూడేళ్లు వీరికి ప్రొబేషన్ కింద ఇవ్వడం జరుగుతుందట. వాస్తవానికి వీరు ప్రభుత్వ ఉద్యోగులే అయినప్పటికీ కూడా, రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపునకు కృషి చేసేలా చూస్తారట. గ్రామాల్లో ఏ పార్టీ ఎలా వుంది, ప్రజలు ప్రస్తుత ప్రభుత్వ పాలనపై ఎలాంటి అభిప్రాయాన్ని తెల్పుతున్నారు అనే పలు విషయాలను వారి ద్వారా తెలుసుకోవచ్చునని, తద్వారా పాలనలో లోటుపాట్లు ఏమైనా ఉంటే సరి చేసుకోవచ్చు అనేది ఆయన ఆలోచన. ఈ విధంగా కేసీఆర్ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా, అటు ఉద్యోగ నియామకాలు చేపట్టడము, మరోవైపు తమ పార్టీ ప్రచారం చేసుకోవడము అన్నట్లుగా రెండువిధాలుగా ఈ నియామకాలు ఆ పార్టీవారికి ఉపయోగం ఉంటుందని ఈ విధంగా ఆలోచన చేశారట. మరి కేసీఆర్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో తేలియాలంటే, రాబోయే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే…….

  •  
  •  
  •  
  •  

Comments