త్వరలో ల్యాండ్ ఫోన్ నుండి వీడియో కాలింగ్ : బిఎస్ఎన్ఎల్

Tuesday, May 29th, 2018, 09:54:36 PM IST


ఇప్పటికే మార్కెట్లో అటు మొబైల్ ఫోను ల ధరలు, ఇటు మొబైల్ టారిఫ్ ల ధరలు చాలా వరకు అందరికి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్న వారిలో చాలామంది వాట్సాప్, గూగుల్ డుయో తదితర వీడియో కాలింగ్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వీడియో కాల్స్ చేస్తున్నారు. వాయిస్ కాలింగ్ తో పోలిస్తే వీడియో కాలింగ్ లో అయితే అవతలి వ్యక్తులు కనబడడం, చుట్టూ ప్రక్కల పరిస్థితులు కూడా పరిస్థితులు కూడా తెలుస్తాయి కాబట్టి చాలా వరకు ఎక్కువమంది ఈ వీడియో కాలింగ్ సదుపాయం వినియోగిస్తున్నారు. ఇక మొబైల్ ఫోన్ లలో ఇటువంటి నూతన పోకడల రాకతో ల్యాండ్ లైన్ ఫోన్ లు చాలా వరకు కనుమరుగు అయ్యే పరిస్థితికి వచ్చేసాయి. అందువల్ల భారతీయ ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ఫోన్ లు అంతర్ధానానికి చెక్ పెడుతూ, ఇకపై ల్యాండ్ ఫోన్ ల ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్ మాదిరిగానే చాటింగ్, మెసేజింగ్, వీడియో కాలింగ్ తదితర సదుపాయాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది.

అయితే ఈ పద్దతిని తొలుత రాజస్థాన్లోని బుండి, హిందోలి ప్రాంతాల్లో త్వరలో ప్రారంభిస్తామని, అందుకు గాను ఆయన ప్రాంతాల టెలిఫోన్ ఎక్స్చేంజి లను నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ తో అప్ గ్రేడ్ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ల్యాండ్ ఫోన్ లను ఐపి అడ్రస్ కు అనుసంధానం చేయడం ద్వారా వినియోగదారులకు ఈ సదుపాయం కల్పించనున్నారు. కావున రానున్న రోజుల్లో ఈ పద్ధతి ద్వారా వీడియో కాలింగ్, చాటింగ్ వంటివి సులువుగా ఆండ్రాయిడ్ ఫోన్ వలే వినియోగించుకోవచ్చని, తొలుత రాజస్థాన్ లో ప్రయోగాత్మకంగా అమలు చేసాక అతిత్వరలోనే ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని బిఎస్ఎన్ఎల్ ప్రతినిధులు చెపుతున్నారు……

  •  
  •  
  •  
  •  

Comments