టిడిపి లో మరో కలకలం ,వాట్సాప్ గ్రూప్ లో అశ్లీల వీడియో హల్ చల్

Tuesday, January 9th, 2018, 12:45:17 PM IST

తెలుగు దేశం పార్టీ కి చెందిన వాట్సాప్ గ్రూప్ లో అశ్లీల వీడియో ఒకటి ఇప్పుడు కలకలం రేపుతోంది. కాకినాడ మునిసిపల్ వైస్ చైర్మన్ కోరివూరి రాజు నెంబర్ ద్వారా ఈ వీడియో పోస్ట్ కావడం తో దుమారం రేగింది . ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరికి అధిష్టానమ్ దగ్గరకి చేరడం తో అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం తో తనకి సంబంధం లేదని ఆ వీడియో పిల్లలు ఎవరో తన మొబైల్ నుండి పోస్ట్ చేసి ఉంటారని ఆయన అంటున్నారు.

అది పూర్తిగా అబద్దమని ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకే ఆయన ఈ విధంగా అబద్దాలు చెప్తున్నారని, ఎంతోమంది ప్రముఖ నాయకులూ, కార్యకర్తలు వున్న గ్రూప్ లోకి తన అనుమతి లేకుండా వీడియో పోస్ట్ అయివుంటుంది అని ఆయన అనడం విడ్డూరంగా వుంది అని అంటున్నారు. రాజు పై చెర్యలు తీసుకోవాలని , ఆయన్ని పార్టీ నుండి బహిష్కరించాలని కూడా ఇతర నేతలు అంటున్నారు . ఈ విధంగా అశ్లీల వీడియో లు గ్రూప్ లో పెట్టడం పూర్తిగా ఖండించాల్సిన విషయం అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ పూర్తి విషయమై అధిష్టానం కూడా రాజు పై గుర్రుగా ఉన్నట్లు, అతిత్వరలో ఆయనపై గట్టిగా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది …