వీడియో : ఎయిర్ పోర్ట్ లో స్మిత్ కు ఘోర అవమానం!

Thursday, March 29th, 2018, 12:20:22 PM IST

ఇటీవల బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఏడాదిపాటు నిషేధం విధించబడ్డ ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్
విచారణ ముగియడంతో దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి బయలుదేరాడు. ఈ నేపథ్యంలో జొహానెస్‌బర్గ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న స్మిత్‌ కు ఎయిర్ పోర్టులో ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నాడు. ఎయిర్ పోర్టులో ఉన్న ప్రయాణికులు, క్రికెట్ అభిమానులు స్మిత్ ను చూడగానే చీట్, చీటర్, చీటింగ్ అంటూ హేళన చేస్తూ మాట్లాడారు. ఇదే సమయంలో స్మిత్ కు రక్షణగా వచ్చిన పోలీసులు సైతం ఆయనపై ఏ విధమైన గౌరవం లేకుండా ప్రవర్తించారు. ఆయన్ని ఎస్కులేటర్ కూడా ఎక్కనీయకుండా నడిపించుకుంటూ తీసుకెళ్లారు.

ఈ వీడియోను ఎవరో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అయితే కొందరు మాత్రం స్మిత్ పై సానుభూతిని చూపుతున్నారు. ఎంత బాల్ ట్యాంపరింగ్ తప్పు చేసినా, అతనికి పడాల్సిన శిక్ష పడిందని, ఓ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టార్ తో సౌతాఫ్రికా వ్యవహరించిన తీరు సరికాదని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం సిడ్నీలో స్మిత్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడాల్సి ఉంది. విలేకరుల నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటాడో, వాటికి స్మిత్‌ ఎలా స్పందిస్తాడో అని అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు….