కనపడని రౌడీ సీఎం..!

Friday, December 7th, 2018, 10:30:26 PM IST

టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఉవెత్తున ఎగసిన సంచలనం విజయ్ దేవరకొండ, నోటా సినిమా సమయంలో యువతకు విజయ్ ఇచ్చిన సందేశాలు అన్ని ఇన్ని కావు. ఇవాల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరిశ్రమలోని ప్రముఖులంతా ఉత్సాహంగా తమ ఓటు వేసి, అందరు ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, తెలంగాణ వాస్తవ్యుడైన యువ హీరో విజయ్ దేవరకొండ ఎక్కడ ఓటు వేసిన దాఖలాలు కనపడలేదు. రామ్ చరణ్ కూడా ఓటు వెయ్యనప్పటికీ, తానూ హాలిడే కోసం విదేశాలు వెళ్లటంతో ఓటును వేయలేకపోవటం వల్ల బాధగా ఉందంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.

అయితే విజయ్ నుండి అలాంటి పోస్ట్ ఏదీ సోషల్ మీడియాలో కనపడలేదు. దీంతో అతనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు, నీతులు చెప్పటం కాదు, ఇలాంటి సమయాల్లో బాధ్యతగా వ్యవహరించాలంటయూ సోషల్ మీడియాలో ఆయనపై సెటైర్లు విసురుతున్నారు. అసలు విజయ్ ఓటు వేయకపోవటానికి గల కారణం ఏంటో, అతను దీనికి ఎలాంటి వివరణ ఇస్తాడో వేచి చూడాలి.