బాక్సాఫీస్ వద్ద విజయ్ దేవరకొండ దుమ్ము ధుమారం..!

Wednesday, November 21st, 2018, 09:19:23 AM IST


టాలీవుడ్ సంచలన హీరో విజయ్ దేవరకొండకు ప్లాపుల నుంచి తేరుకొని హిట్ కొట్టడానికి మళ్ళీ ఎంతో సమయం పట్టలేదు.గీత గోవిందం భారీ హిట్ తర్వాత అదే స్థాయి హిట్ అవుతుందనుకుని విడుదల చేసిన నోటా చిత్రం ఘోర పరాజయం పాలయ్యింది.దీనితో విజయ్ యొక్క కెరీర్ ఇక ముగిసిపోయింది అని మాట్లాడుకునే వారి అందరికి నోర్లు మూత పడేలా పైరసీ అయినా “టాక్సీవాలా” చిత్రంతోనే బంపర్ హిట్ కొట్టి చూపించాడు.

అయితే ఈ చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో వసూళ్లు రాబడుతుంది అని తెలుస్తుంది.చిత్రం మొదటి రోజే 10 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఒక్క రోజులోనే బ్రేకీవెన్ సాధించింది అని నిర్మాతలు తెలిపారు.అయితే మొదటి నుంచే మంచి మౌత్ టాక్ రావడంతో విజయ్ టాక్సీ ఇప్పుడప్పుడే ఆపేలా లేదు అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికే ఈ మూడు రోజుల్లోనే ఈ చిత్రం 9 కోట్ల షేర్ రాబట్టి ఈ చిత్రాన్ని కొనుక్కున్న అందరికి రెండింతలు లాభాన్ని చేకూరుస్తుంది అని తెలుస్తుంది.మొత్తానికి విజయ్ మళ్ళీ హిట్ ట్రాక్ లో పడ్డాడు అని అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.