హైదరాబాద్ లో “రౌడీ హీరో”..”డార్లింగ్” ని కూడా దాటేసాడు.!

Friday, March 15th, 2019, 02:30:31 AM IST

హీరోగా తన మొదటి సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ తన తర్వాతి సినిమా “అర్జున్ రెడ్డి”తో మాత్రం ఊహలకందని హిట్ అందుకొని సెన్సషనల్ హీరోగా మారిపోయాడు.అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఎన్నో ఒడిడుకులు ఎదురైనా వాటిని ఎదుర్కొని యువతలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను ఏర్పరుచుకున్నారు.ఇప్పుడు ఇదే క్రేజ్ హైదరాబాద్ లోని మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో డార్లింగ్ హీరో ప్రభాస్ ను కూడా దాటి నెంబర్ 1 స్థానంలో నిలబడ్డాడు.

ప్రతీ ఏడాది హైదరాబాద్ టైమ్స్ వారు ఈ మోస్ట్ డిజైరబుల్ మెన్స్ జాబితా కోసం సర్వే చేస్తారన్న సంగతి తెలిసినదే..అలాగే గత ఏడాది కూడా నిర్వహించగా 2018 మోస్ట్ డిజైరబుల్ మెన్స్ జాబితాలో మన రౌడీ హీరో మొదటి స్థానంలో నిలవగా,డార్లింగ్ హీరో ప్రభాస్ 2,రామ్ చరణ్ 3,మహేష్ 4,తారక్ 9 స్థానాల్లో నిలబడ్డారు.ప్రస్తుతం విజయ్ భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న “డియర్ కామ్రేడ్” సినిమాలో హీరోగా నటిస్తున్నారు.ఇక్కడ గత ఏడాది ఏ సినిమాలు చెయ్యకపోయినా సరే ప్రభాస్ రెండో స్థానంలో నిలవడం విశేషం.