విజయ్ దేవరకొండ సినిమాకు ఊహించని షాక్..!

Thursday, March 14th, 2019, 01:27:58 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరో అనే సినిమా ద్వారా తమిళ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే, అయితే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే ఒక సమస్య వచ్చిపడింది. వివరాల్లోకి వెళితే తమిళ్ లో శివకార్తీకేయ హీరోగా “హీరో” టైటిల్ తో ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నారు, ఈ మేరకు టైటిల్ ను కూడా ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేశారట. దీంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా ఆనంద్ అన్నామలై డైరెక్షన్ లో విజయదేవరకొండ హీరోగా రుపొందాల్సిన తమిళ సినిమాకు టైటిల్ మార్చక తప్పని పరిస్థితి ఏర్పడిందట.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా డియర్ కామ్రేడ్ సినిమా రూపొందుతోంది, ఈ సినిమాను మే చివరి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టాక్సీవాలా సినిమాతో హిట్ అందుకున్న ఊపు మీదున్న విజయ్ దేవరకొండ తమిళ్ లో ఎంట్రీ ఇవ్వాలన్న తొలి ప్రయత్నంలోనే ఇలాంటి సమస్య ఎదురవటం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.