వైరల్ వీడియో : కనీసం నిలబడలేని పరిస్థితిలో అప్పటి స్టార్ హీరో!

Thursday, September 6th, 2018, 02:44:45 PM IST

ఒకప్పుడు తన నటనతో ఫైట్లతో తమిళనాడు బాక్స్ ఆఫీస్ కు కొత్త పాఠాలు నేర్పిన కథానాయకుడు విజయ్ కాంత్. డీఎమ్ డీకే పార్టీని స్థాపించి రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే వయసు పెరిగిన తరువాత విజయ్ బయట ప్రపంచానికి ఎక్కువగా కనిపించడం లేదు. గత కొంత కాలంగా విజయ్ అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.

ఇకపోతే ఇటీవల కరుణానిధి సమాధి వద్ద నివాళులు అర్పించడానికి వచ్చి అందరిని షాక్ కి గురి చేశారు. మొదట ఆయన విజయ్ కాంత్ అని ఎవరు నమ్మలేకపోయారు. ఎందుకంటే వెండితెరపై ఎంతో స్పీడ్ గా యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకున్న విజయ్ కనీసం సపోర్ట్ లేకుండా నిలబడలేకపోతున్నారు. తోటివారి సపోర్ట్ తో నడుచుకుంటూ కరుణానిధి సమాధి దగ్గరకి వచ్చి కన్నీరు పెట్టుకున్నారు. సమాధిపై పూలు జల్లి నివాళులర్పించారు. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments