అప్పులన్నీ చెల్లిస్తా – విజయ్ మాల్యా సంచలన ట్వీట్..!

Wednesday, December 5th, 2018, 04:01:56 PM IST

దేశంలోని పలు బ్యాంకుల్లో బకాయిలు చేసి చెల్లించకుండా విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యా, తాను చేసిన అప్పులన్నీ 100శతం తిరిగి చెల్లిస్తా అని అంటున్నాడు. బ్యాంకులో రుణాలు తీసుకొని చెల్లించకుండా పారిపోయానని, తానూ ఎగవేతదారుడిని అని మీడియా, రాజకీయ నాయకులు కలిసి తనపై తప్పుడు ముద్ర వేస్తున్నారని, అదంతా ఆపద్ధం అని, నిజానికి 100 శాతం రుణాలు చెల్లిస్తానని, కర్ణాటక హై కోర్ట్ ముందే రాజీకి ప్రయత్నించానని, ఆ విషయంపై వారు ఎందుకు మాట్లాడారని విజయ్ మాల్యా ప్రశ్నించారు.

విమాన ఇంధన ధరలు పెరగటంతో విమానయాన సంస్థలన్నీ ఇబ్బందులు ఎదుర్కున్నాయని, కింగ్ ఫిషర్ కూడా వాటిలాగే ఇబ్బందిని ఎదుర్కొంది తెలిపాడు. బ్యాంకుల నుండిరుణంగా తీసుకున్న సొమ్మంతా కూడా అయిపోయిందని, అయినప్పటికీ 100 శతం రుణాలు తిరిగి చెల్లిస్తా అని అంటున్నాడు. కోర్ట్ జప్తు చేసిన తన ఆస్తులన్నీ తిరిగి ఇచ్చేస్తే 100శాతం రుణాలు చెల్లిస్తానని అన్నారు. దేశంలోనే అతిపెద్ద మద్యం విక్రయాల సంస్థగా గత 30ఏళ్ళుగా దేశ ఖజానాకు 5వేల కోట్లకు పైగా చెల్లించామని అన్నారు, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ద్వారా కూడా రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో సొమ్ము చెల్లించాం అని అన్నారు. ఒకప్పుడు బాగా నడిచిన ఎయిర్ లైన్స్, నష్టాలు రావటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, అయినప్పటికీ నేను రుణాలన్నీ చెల్లిస్తా ఎందుకంటే అది ప్రజల సొమ్ము కాబట్టి అని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్లు చేసారు.