మాల్యగారు ఇండియా ఎప్పుడు వస్తారు?

Sunday, September 9th, 2018, 01:58:59 AM IST

ఇండియన్ బ్యాంకులను బోల్తా కొట్టించి విదేశాలకు ఎగిరిపోయిన కింగ్ ఫిషర్ యజమాని విజయ్ మాల్యా త్వరలోనే భారత్ రానున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈడీ అధికారుల నుంచి కొన్ని వారాల క్రితం అందిన సమాచారం ప్రకారం మాల్యా తన అప్పులను కట్టడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాడట. తన ఆస్తులను అమ్మెందుకు ఇప్పటికే కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు టాక్. గతంలో బ్రిటిష్ ప్రభుత్వంతో మంతనాలు జరిపిన ప్రభుత్వ అధికారులు మాల్యాను అరెస్ట్ చేయడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు.

అయితే అవేవి ఫలితానివ్వలేదు. ఇకపోతే చాలా రోజుల తరువాత మాల్యా మీడియా కంట పడ్డాడు. అప్పులు తీర్చడానికి ఎంతగా కష్టపడుతున్నాడో అనుకున్న అందరూ అతన్ని స్టేడియం దగ్గర చూసి అందరూ షాక్ అయ్యారు. ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగవ టెస్ట్ వీక్షించడానికి మాల్యా స్టేడియం దగ్గర దర్శనమిచ్చాడు. దీంతో మీడియా అతన్ని ప్రశ్నించగా స్టేడియంలో కేసుకు సంబందించిన విషయాలు మాట్లాడలేనని తెగేసి చెప్పేశాడు. ఇక భారత్ కు ఎప్పుడు వస్తారు అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు దానికి కోర్టులో జడ్జినే నిర్ణయిస్తాడు అంటూ సమాధానమిచ్చి మాల్యా మెల్లగా జారుకున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments