విజయ్ మాల్యా రాకకు లైన్ క్లియర్…

Monday, February 4th, 2019, 10:37:13 PM IST

ఇండియా లోని బ్యాంకుల్లో అప్పులు చేసి, అవి ఎగ్గొట్టి విదేశాలకి పారిపోయిన లిక్కర్ మాఫియా కింగ్ బిజె మాల్యా ను తిరిగి భారత్ కు అప్పగించేందుకు యూకే లైన్ క్లియర్ చేసింది. భారత అధికారుల అప్పగింత వినతిని యుకె హోమ్ సెక్రటరీ నేడు ఆమోదం తెలిపారు. విజయ్ మాల్యాను భారత్ కు అప్పగిస్తూ పత్రాలపై సంతకం చేశారు. దీంతో విజయ్ మాల్యా త్వరలోనే భారత్ కు రానున్నారు. కాగా దీనిపై విజయ్ మాల్యా 14 రోజుల్లోగా కోర్ట్ లో అప్పీల్ చేసుకోవచ్చు.

తన సొంత వ్యాపారాల కోసమే కోసం బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని వాటిని ఎగ్గొట్టి విజయ్ మాల్యా బ్రిటన్ కు పారిపోయిన సంగతి తెలిసిందే. దాదాపుగా అన్ని బ్యాంకుల్లో కలిపి ఆయన 9000 కోట్ల అప్పు ఎగ్గొట్టి మరీ విదేశాలకు చెక్కేశారు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు ఇప్పటికే విజయ్ మాల్యాను భారత్ పంపేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు బ్రిటన్ హోమ్ శాఖ కూడా ఆమోదం తెలిపింది.