విజయ్ మాల్యా అప్పులు కట్టేస్తారట!

Tuesday, July 31st, 2018, 06:51:06 PM IST

భారత బ్యాంకులకు దాదాపు 9 వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టిన విజయ్ మాల్యాను భారత్ కు రాప్పించడానికి భారత అధికారులు గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు వెస్ట్‌మినిస్టర్‌ కోర్టుకు విజయ్ మాల్యా తన కుమారుడు సిద్దార్థ్ మాల్యాతో హాజరయ్యారు. ఇక నేడు మాల్యాను భారత్ కు అప్పగించేందుకు దాఖలైన పిటిషన్ పై అక్కడి కోర్టులో విచారణ జరగనుంది. అయితే కోర్టు ఎదుట మీడియాతో మాట్లాడిన మాల్యా తన 14 వేల కోట్ల రూపాయల ఆస్తులను అమ్మి తప్పకుండా బకాయిలను తీర్చేస్తానని వివరణ ఇచ్చారు. కోర్టు ఏది చెప్పినా కూడా వింటానని తెలిపారు. తాను ఏ మోసం చేయలేదని తనపై వస్తున్న మని లాండరింగ్ ఆరోపణలు అవాస్తవమని చెప్పిన మాల్యా సమస్యను కోర్టు పరిష్కరించాల్సిందిగా కోరారు.

  •  
  •  
  •  
  •  

Comments