నోటా..స్నీక్ పీక్ : విజయ్ సరికొత్త అవతారం..!

Wednesday, September 5th, 2018, 04:15:53 PM IST

ప్రతి సినిమా డిఫెరెంట్ గా ఉండాలని ప్రతి ఒక్క హీరో కోరుకుంటాడు. కానీ అందుకు తగ్గట్టు కథలు రావాలి. చాలా మంది హీరోలు వినూత్నమైన క్యారెక్టర్స్ తో ఆకట్టుకోవాలని ఆకట్టుకువడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ట్రైలర్స్ వరకే వారి స్టామినా కనపడుతోంది. కానీ విజయ్ దేవరకొండ మాత్రం తన మొదటి సినిమా నుంచి మంచి కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. సక్సెస్ ల రేంజ్ కూడా పెరిగిపోతోంది.

ఇక ఇప్పుడు సరికొత్త రాజకీయ నాయకుడి అవతారంలో కనిపించడానికి కుర్ర హీరో సిద్దమయ్యాడు. నోటా అనే సినిమాలో విజయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇక ట్రైలర్ ను రేపు విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. ముందుగానే స్నిక్ పిక్ అనే వీడియోను రిలీజ్ చేసి అంచనాలను రేపింది చిత్ర బృందం. విజయ్ అందులో రౌడీ, పొలిటిషియన్, లీడర్ పాత్రల్లో కనిపించనున్నాడు. గురువారం నాలుగు గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments