అర్ధరాత్రి బైక్ మీద వచ్చి ఆర్థిక సాయం చేసిన హీరో విజయ్!

Wednesday, June 6th, 2018, 10:25:53 PM IST


తమిళనాడులో ప్రజలకు రాజకీయ నాయకుల మధ్య సంబంధం ఏ స్థాయిలో ఉందొ తెలియదు గాని హీరోలకు జనాలకు చాలా దగ్గరి సంబంధం ఉందని చెప్పవచ్చు. ఎలాంటి సమయంలో అయినా హీరోలు స్పందించి ప్రజలకు అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. కోలీవుడ్ హీరోల ప్రవర్తన అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా స్టెరిలైట్‌‌ రాగి కర్మాగారానికి వ్యతిరేకంగా జరిపిన ఆందోళనలో 13 మంది మరణించిన సంగతి తెలిసిందే.

అయితే వారిని రజినీకాంత్ కమల్ హసన్ పరామర్శించారు. రజినీకాంత్ మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాడు. ఇక మరో హీరో విజయ్ కూడా అర్ధరాత్రి సమయంలో ఆర్బాటం లేకుండా మృతుల కుటుంబాలను పరామర్శించి వెళ్లాడని తెలుస్తోంది. బైక్ మీద వచ్చి బాధిత కుటుంబాలకు లక్ష రూపాయలు ఇచ్చాడట. అందుకు సంబందించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. విజయ్ సింపుల్ గా వచ్చి సహాయం చేయడాన్ని గుర్తు చేసుకొని బాధిత కుటుంబాలు భావోద్వేగానికి లోనవుతున్నాయి. తమ కోసం అలోచించి అర్ధరాత్రి తలుపు తట్టి మరి సహాయాన్ని చేయడం నిజంగా గొప్ప విషయమని జనాలు ప్రశంసిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments