హిట్టా లేక ఫట్టా : నోటా -విజయ్ ఈ సారి ఆకట్టుకోలేదు.

Friday, October 5th, 2018, 06:44:18 PM IST

పెళ్లి చూపులు,అర్జున్ రెడ్డి,గీత గోవిందం వంటి వైవిధ్యభరితమైన చిత్రాల తరహాలోనే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఈ రోజు “నోటా” చిత్రంతో మరో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.తాను ముందు చిత్రాల్లో ఒకటి రెండు చిత్రాలు నిరాశపరిచినా విజయ్ అంతకంతకు ఎదుగుతూ వచ్చాడు.ఇప్పుడు కూడా ముందు చిత్రాల్లా ఎవరూ ఊహించని రీతిలో రాజకీయ నేపధ్యం ఉన్న కథను ఎంచుకొని ఆశ్చర్య పరిచాడు.తన ముందు చిత్రాల్లాగే ఈ చిత్రానికి కూడా కొన్ని వివాదాలు తప్పలేదు ఆ వివాదాలు అన్నిటినీ దాటుకుంటూనే భారీ క్రేజ్ తో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇప్పుడు ఈ చిత్రం హిట్టా లేక ఫట్టా అనేది ఇప్పుడు చూద్దాం.

ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకే సారి విడుదలయ్యింది.ఈ చిత్రంలో వరుణ్(విజయ్ దేవర కొండ) అప్పటికి ముఖ్యమంత్రి అయిన వాసుదేవన్(నాజర్) కొడుకు. నాజర్ కొన్ని ఊహించని సంఘటనలు మలుపులు ద్వారా జైల్లోకి వెళ్లే ముందు అసలు రాజకీయాల కోసం ఏ మాత్రం అవగాహన లేని,విజయ్ ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడతాడు,తన తండ్రి ఆదేశాల మేరకు విజయ్ ముఖ్యమంత్రిగా నడుచుకుంటాడు.అదే సమయంలో తాను అప్పుడున్న నీచ రాజకీయాలను ఎలా ఎదుర్కున్నాడు? అసలు నాజర్ విజయ్ ని ఏ కారణాల చేత ముఖ్యమంత్రిగా చెయ్యాల్సొచ్చింది అన్నది కథాంశం.

దర్శకుడు ఆనంద్ శంకర్ ఎంచుకున్న కథ పరవాలేదనిపించినా దాన్ని నడిపించడంలో విఫలం అయ్యాడనే చెప్పాలి.సినిమా ఆరంభం అయ్యిన మొదటి నుంచి విరామ సన్నివేశం వరకు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ..రెండో సగం మీద ఇంకా అంచనాలు పెంచుతుంది.ఈ చిత్రంలో దర్శకుడు ఎంచుకున్న కథ,కొన్ని సన్నివేశాలు,విజయ్ ముఖ్యమంత్రి అయ్యే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.కానీ రెండో సగానికి వచ్చే సరికి మొత్తం సీన్ అంతా మారిపోయింది.సాగదీతగా ఉండే బోరింగ్ సీన్లు వల్ల కథలో పట్టు తప్పిపోతుంది.అదే తరహా కొనసాగడం వల్ల ప్రేక్షకుడు కాస్త గందరగోళానికి లోనవుతాడు.ఎన్నో అంచనాల నుంచి మొదలయ్యిన చిత్రం పేలవంగా గజిబిజిగా ముగుస్తుంది.అసలు ఈ చిత్రంలో హీరోయిన్ మెహ్రీన్ పాత్రకు ప్రాధాన్యతే ఇవ్వలేదు,పేరుకే ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ భాషల్లో తెరకెక్కించినా సినిమా మొత్తం తమిళ చిత్రాల తరహాలోనే ఉంది. ఇదే ఈ చిత్రానికి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు.మొత్తంగా చూసుకుంటే మంచి కథను ఎంచుకున్న దర్శకుడు యువతరానికి ఎదో చెపుదాం అనుకున్నా దాని మాత్రం చేరవేయడంలో విఫలమయ్యాడు.దానికి తోడు విజయ్ దేవర కొండ నుంచి ఏ తరహా నటన ఐతే అతని అభిమానులు ఆశిస్తారో అది కూడా కనిపించదు. మొత్తానికి ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.

నోటా – రొటీన్ పొలిటికల్ డ్రామా

Reviewed By 123telugu.com |Rating : 2.75/5

నోటా – రాజకీయ నాయకునిగా విజయ్ ని చూడొచ్చు

Reviewed By timesofindia.com |Rating : 3/5

నోటా బోర్ కొట్టించే సినిమా

Reviewed By mirchi9.com |Rating : 2/5

“నోటా”కు నో చెప్పొచ్చు

Reviewed By greartandhra.com|Rating : 2/5

నోటా – రాజకీయ నాటకం.

Reviewed By telugumirchi.com|Rating : 2.25/5