వెన్నుపోటు విషయం ఎన్టీఆర్ బయోపిక్ లో ఉంటుందా? లేదా?

Tuesday, September 4th, 2018, 11:19:08 AM IST

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ సినిమాపై చేస్తున్న కామెంట్స్ ప్రతిసారి వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారో అందరికి తెలిసిందే. అయితే అలాంటి సంఘటనలను బాలకృష్ణ దర్శకుడు క్రిష్ ఎలా ప్రజెంట్ చేస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇకపోతే రీసెంట్ గా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రశ్నించిన తీరు మీడియాల్లో చర్చనీయాంశంగా మారింది. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘ఎన్టీఆర్’ సినిమాలో దివంగత ఎన్టీఆర్ ను నారా చంద్రబాబు నాయుడు వంచించిన విషయాన్ని అలాగే వెన్నుపోటు ఎలా పొడిచారో అనే విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నారా? లేదా? అని ప్రశ్నించడం వైరల్ గా మారింది. అదే విధంగా జగన్ అంటే.. టీడీపీ అంతమే అని వర్ణించారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ఖాయమని తాము తప్పకుండా అధికారంలోకి వస్తామని విజయసాయి రెడ్డి తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments