మహాత్మ మమ్మల్ని క్షమించు ! : విజయ్ సాయి రెడ్డి

Wednesday, October 3rd, 2018, 03:48:50 AM IST

అంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతుండటం తోటి ప్రతి ఒక్కరూ ఇంకొకరు చేసిన తప్పులని వేలెత్తి చూపించుకుంటున్నారు.. ఐతే ఇందులో ఎక్కువగా వైసిపీ మరియు టీడీపీ నాయకులు ఎక్కువుగా ఒకరిపై ఇంకొక్కరు ఎక్కువగా విమర్శలు చేసుకుంటున్నారు. ఐతే ఇది ఇలా ఉండగా క్రితం ఏడాది బెల్టు షాప్ లని బంద్ చేయాలనీ మరియు గ్రామానికి 2 లేదా 3 కిలోమీటర్ల దూరం లో నిర్వహించాలని , అంతే గాక స్కూలు దగ్గర కాలేజీ ల దగ్గర , దేవాలయాల దగ్గర ఉండకూడదని , అలా ఉంటె వాటి లైసెన్స్ లు రద్దు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే ఇలా చేసిన కొన్ని రోజుల బాబు గారి ఆదేశాలు బాగానే పాటించారు కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ యథావిథి గా బెల్టు షాప్ లని నిర్వహిస్తున్నారు.

ఐతే ఈ విషయం పై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నిస్తూ బాబు గారు అప్పుడు చేసిన ఆదేశాలను ఎవరూ పట్టించుకోవడంలేదని మరియు మద్యం ఒక ఆదాయ వనరు గా చూస్తున్నారని అన్నారు. అంతే గాక రాష్ట్రం లో రేషన్ షాప్ ల కంటే బెల్ట్ షాప్ లే ఎక్కువ ఉన్నాయని , బెల్ట్ షాప్ లు తెలుగు తమ్ముళ్ల పాలిట చంద్రన్న కానుక గా మారాయని ఎద్దేవా చేసారు. ఇది ఇలాగె కొనసాగితే మద్యం అమ్మకాల్లో వచ్చే ఆదాయం లో ఏపీ నెం 1 గా నిలిచిందని బాబు ప్రకటించినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని , మమ్మల్ని క్షమించి మహాత్మ అని తన ఫేస్బుక్ పోస్టు ద్వారా తెలిపారు.