రాములమ్మ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదా?

Tuesday, October 2nd, 2018, 03:58:25 AM IST


ఒసేయ్ రాములమ్మ గా తెలంగాణ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ శాంతి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు రంగం సిద్ధం అయింది. ప్రస్తుతం ఆమెను కాంగ్రెస్ పార్టీ తరపున చరిష్మా ఉన్న నటి కాబట్టి ఈ ఎన్నికల కాంపైన్ లో ప్రత్యేక స్తానం కేటాయించారు. ప్రస్తుతం తెరాసను ఓడించే ప్రయత్నాల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకటవుతున్నాయి. ముక్యంగా కాంగ్రెస్ – తెలుగు దేశం పార్టీ కలిసి .. కేసీఆర్ ని ఓడించే దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ అవతరణకు ముందు తెరాసలో చేరిన విజయ శాంతి ఆ తరువాత కేసీఆర్ తో విబేధాల కారణంగా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు .. ఆ తరువాత లైం లైట్ లోకి రాకుండా ఉన్న విజయశాంతి ఈ మద్యే మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. అయితే ఆమె 2019 లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇన్నాళ్లు లో ప్రొఫైల్ మైంటైన్ చేసిన ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటమి పాలయ్యే అవకాశాలు ఉండడంతో కావాలనే ఈ ఎన్నికల్లో పోటీ చేయదని అంటున్నారు. ఈ ఎన్నికల క్యాంపైన్ పూర్తీ స్థాయిలో సక్సెస్ చేసి .. కాంగ్రెస్ ని గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సో విజయశాంతి నిర్ణయం ఏమిటన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే .