కాషాయంతో క‌మ్మ‌నైన కాపురం.. విజ‌య‌సాయిరెడ్డి స్పెష‌ల్ ట్వీట్..!

Monday, February 11th, 2019, 04:10:53 PM ISTఏపీ ముఖ్య‌మ‌త్రి టీడీపీ అధినేత‌ నారా చంద్ర‌బాబు ఈరోజు రాష్ట్రానికి ప్ర‌త్యేక‌హోదా, విభ‌జ‌న‌చ‌ట్టం అమ‌లు విష‌యంలో కేంద్ర‌ప్ర‌భుత్వ వైఖ‌రిని నిర‌సిస్తూ ఢిల్లీలో ఒక్క‌రోజు ధ‌ర్మ‌పోరాట దీక్ష చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ముందుగా రాజఘాట్ వద్దకు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులర్పించిన చంద్రబాబు ఆతర్వాత అంబేద్కర్ , ఎన్టీఆర్ ఫొటోలకు నివాళులర్పించారు.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ఢిల్లీలో దీక్షలో పాల్గొనే వారి కోసం టీడీపీ ఛార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసింది. ఇందులో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఇలా అంద‌రూ వెళ్ళారు. అయితే వారితో పాటు బీజేపీ ఎంపీ హరిబాబు ఉండటంతో రాజ‌కీయ‌వ‌ర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఇప్పుడు దానికి స‌బంధించిన ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో, తాజాగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.

టీడీపీ-బీజేపీలు ప‌బ్లిక్‌గా మాత్రం ఒక‌రి పై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటున్న‌ట్టు న‌టిస్తూ.. ప్రైవేటుగా స్పెష‌ల్ ప్రేమాయ‌ణం సాగిస్తున్నార‌ని విజ‌య‌సారిరెడ్డి ఆరోపించారు. ఒక‌వైపు రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేసింద‌ని అంటారు.. మ‌రోవైపు ఆ పార్టీ నేత‌ల‌తో స్పెష‌ల్ రిలేష‌న్‌ను కొన‌సాగిస్తున్నారు.. మ‌ళ్ళీ వైసీపీ పై నింద‌లు వేస్తారు.. చాటుగా కాషాయంతో క‌మ్మ‌నైన కాపురం చేస్తుంద‌న‌డానికి ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఏం కావాల‌ని విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్నించారు. మ‌రి విజ‌య‌సాయి రెడ్డి వ్యాఖ్య‌లు పై టీడీపీ త‌మ్ముళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి.