హ‌రికృష్ణ‌ చ‌నిపోతే నీకు ఆనందంగా ఉందా.. విజ‌య‌సాయి రెడ్డి సంచ‌ల‌నం..!

Monday, November 19th, 2018, 08:31:01 AM IST

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే, సినీ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ పై సోష‌ల్ మీడియా వేధిక‌గా చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తెలంగాణ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో మాహాకూట‌మిలో భాగంగా టీడీపీ- కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో టీడీపీ కంచుకోట‌గా ఉన్న కూక‌ట్‌ల్లి నియోజ‌క వ‌ర్గంలో.. చంద్ర‌బాబు వ్య‌హాత్మ‌క అడుగులో భాగంగా.. టీడీపీ అభ్య‌ర్ధిగా నంద‌మూరి వార‌సురాలిగా సుహాసినికి టిక్కెట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఇక సుహాసిని శ‌నివారం నామినేష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ‌, మాట్లాడుతూ.. నంద‌మూరి కుటుంబం నుండి వస్తున్న ఆడ‌ప‌డుచు సుహాసినిని గెలిపించే బాధ్య‌త మీదే అని ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. అంతేకాకుండా త‌న అన్న నంద‌మూరి హ‌రికృష్ణ గారిఅకాల మరణం అందరిని కూడా సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తిందని బాల‌య్య అన్నారు. దీంతో సంభ్రమాశ్చర్యం అనే పదాన్ని క్యాచ్ చేసిన వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి బాల‌కృష్ణ పై విమ‌ర్శ‌లు వాన కురింపించారు. మీ అన్న హరికృష్ణ గారు చనిపోవడం మీకు సంబరంతో కూడిన ఆశ్చర్యం కలిగించిందా.. బాల‌కృష్ణ‌, నిజ‌మేలే..తండ్రికి వెన్నుపొడిచి కాటికి పంపిన వాడితో చేతులు కలిపిన చరిత్ర కదా మీది… కుటుంబ సభ్యలు మరణిస్తే ఆనందం కలుగుతుందా.. నిజమే మాట్లాడావయ్యా బాలయ్యా అంటూ త‌న సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో బాల‌య్య పై విజ‌య‌సాయి రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. మ‌రి విజ‌య‌సాయి వ్యాఖ్య‌ల పై బాల‌కృష్ణ ఎలా స్పందిస్తారో చూడాలి.