పవన్ కళ్యాణ్ కి తెలంగాణలో వీసా ఎలా ఇచ్చారు: విజయశాంతి

Tuesday, January 23rd, 2018, 09:50:57 AM IST

మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో పర్యటనలు చేసిన పవన్ కళ్యాణ్ రీసెంట్ గా తెలంగాణ జిల్లాలో అసలైన రాజకీయ యాత్రను స్టార్ట్ చేశారు. అయితే ఈ విషయంపై ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేతలైతే ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ అధికారం కోసం పవన్ వచ్చాడని కామెంట్స్ చేశారు. ఇక సినీనటి, కాంగ్రెస్ నేత విజయశాంతి కూడా తనదైన శైలిలో పవన్ ప్రజాయాత్రపై స్పందించారు. అయితే ఆమె ఈ విషయంలో కేసీఆర్ ని ఎక్కువగా టార్గెట్ చేశారు. గత సకల జనుల సమ్మెలో పవన్ కళ్యాణ్ ను టూరిస్ట్ అన్న కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో ప్రచారం చేసుకోవడానికి వీసా ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అంతే కాకుండా తెలంగాణలో పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన స్వేచ్ఛను చాలా మంది ఉద్యమ నాయకులు, జేఏసీ నాయకులు పోరాటానికి ఇవ్వకపోవడం శోచనీయమని కామెంట్ చేశారు. వారికి కూడా వీసాలను ఇస్తే కనీసం తెలంగాణాలో తామున్నాం అనే భావన కలుగుతుందని తెలిపారు. ఇక వారిని నిర్బంధిస్తుంటే పరిస్థితి ఎంత ధారుణంగో ఉందొ అర్ధం చేసుకోవచ్చని వివరించారు.