విజయశాంతిలో చిగురిస్తున్న కొత్త ఆశలు !

Wednesday, October 31st, 2018, 11:41:19 AM IST

టిఆర్ఎస్ హయాంలో మెదక్ ఎంపీగా పనిచేసిన సినీ నటి విజయశాంతి ఆ తర్వాత కాంగ్రెస్ గడప తొక్కి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తిరస్కారానికి గురయ్యారు. ఆ ఓటమితో తనకిక రాజకీయాలు సరిపడవని నిర్ణయించుకున్న ఆమె చాలా రోజుల నుండి జనానికి దూరంగా ఉంటూ వచ్చారు. కానీ ఈసారి ఎన్నికల్లో పనిచేయాలని కాంగ్రెస్ పట్టుబట్టడంతో కేవలం ప్రచారానికి మాత్రమే వస్తానని, పోటీ చేయనని స్పష్టం చేసి మరీ యాక్టివ్ పాలిటిక్స్ మొదలుపెట్టారామె.

కానీ ఇప్పుడు ఆమెలో మార్పు కనిపిస్తోంది. మెల్లగా ఆమెలో పోటీకి దిగాలనే ఉత్సాహం పుట్టుకొచ్చింది. మహాకూటమికి జనంలో ఉన్న బలం తనను గెలిపిస్తుందనే నమ్మకమే ఆమెను పోటీకి దిగడానికి ప్రోత్సహించిందని టాక్. ప్రస్తుతం ముందుగా తెలంగాణ జన సమితికి ఇవ్వాలనుకున్న ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం మీద విజయశాంతి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. అందుకే మెదక్, దుబ్బాకల నుండి టిజెఎస్ పోటీ చేయడం కన్నా కాంగ్రెస్ పోటీకి దిగితే మేలనే ప్రచారాన్ని ఆమె మొదలుపెట్టారని అనిపిస్తోంది. మరి గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ రాములమ్మ కోరికను మన్నిస్తుందో లేదో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments