కెసిఆర్ కి 100 సీట్లు కాదు 100లో జ్వరం తెప్పిస్తా..రాములమ్మ సంచలన వ్యాఖ్యలు!

Monday, October 22nd, 2018, 03:11:40 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఒక్కోక్క పార్టీకి చెందినటువంటి నేతలు వారి యొక్క ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు.తెలంగాణలోని టీకాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీలు కలిసి ఈ సారి ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసినదే.తెరాస పార్టీ ని వీడి టీకాంగ్రెస్ జెండా కప్పుకున్నటువంటి తెలంగాణ రాములమ్మను టీకాంగ్రెస్ నేతలు వారి యొక్క స్టార్ కాంపైనర్ గా నియమించుకున్నారు.

అంతే కాకుండా గత కొన్ని రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నుంచి నందమూరి బాల కృష్ణ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.అయితే ఇప్పుడు తాజాగా విజయశాంతి అలంపూరులో నిర్వహిస్తున్న రోడ్ షో లో కెసిఆర్ మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.కెసిఆర్ వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు వస్తున్నాయని మాట్లాడుతున్నారని,ఈ కాంగ్రెస్ కొట్టే దెబ్బకి కెసిఆర్ కి 100 సీట్లు కాదు 103 జ్వరం వస్తుందని పేర్కొన్నారు.కెసిఆర్ మహాకూటమిని చూసి భయపడుతున్నారని,ఈ వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అని కెసిఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.